ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించాలి అని ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్ట్ లో షాక్ తగిలింది. హైకోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడానికి గానూ సుప్రీం కోర్ట్ నిరాకరించింది. 

 

నిమ్మగడ్డ విషయంలో ప్రతి వాదులకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీం కోర్ట్. ప్రస్తుతం దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. రెండు వారాల్లో ప్రతివాదులు సమాధానం చెప్పాలని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఇక దీనిపై ఏపీ సర్కార్ తన వాదనలను వినిపిస్తుంది. కాగా నిమ్మగడ్డ రమేష్ తాను విధులకు హాజరు కావడానికి సిద్దంగా ఉన్నా అని చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: