తెలంగాణాలో చిరుత పులులు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ కి దగ్గరగా ఉన్న దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పులులు ఎక్కడో ఒక చోట బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణా ప్రాంతం వైపు ఈ పులులు వస్తున్నాయి. తాజాగా మరో పులి కనపడింది తెలంగాణాలో. 

 

కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో చిరుత సంచారం అక్కడి స్థానికులను భయపెడుతుంది. పల్లెగడ్డ తండా, సామ దుబ్బ తండా, పిర్యాయి కుంట తండాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు తండా వాసులు గుర్తించి అటవీ  శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దయచేసి పులిని వెంటనే పట్టుకోవాలి అని వారు కోరుతున్నారు. తాము ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: