కేటిఆర్ పై ఆరోపణల నేపధ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్ట్ హైకోర్టు స్టే విధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై  విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. 

 

ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, కక్షపూరితంగా ఫిర్యాదు చేశారని, రేవంత్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయని పిటిషన్‌లో కేటీఆర్ ఆరోపణలు చేసారు. అదే విధంగా ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ ఆయన పిటీషన్ వేసారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: