హైదరాబాద్ లో జూనియర్ డాక్టర్లతో మంత్రి ఈటెల రాజేంద్ర చర్చలు ఫలించాయి. వారి డిమాండ్ లపై ఈటెల సానుకూలం స్పందించారు. ఆందోళన విరమించి వారు డ్యూటి లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేంద్ర మాట్లాడారు. డాక్టర్లు రోడ్ల మీదకు వచ్చే సందర్భం ఇది కాదని ఆయన అన్నారు. మీ సమస్యలు మాకు చెప్పమని కోరారు. 

 

కేసీఆర్ తో మాట్లాడి తాను సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తా అని అన్నారు. డాక్టర్లు ఉండాల్సింది ఐసియులో రోగుల దగ్గర అని అన్నారు. మీరు చేసే పనితోనే తెలంగాణకు మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. రోడ్ల మీదకు వస్తే మీకు గౌరవం పెరగదు అంటూ ఈటెల వ్యాఖ్యానించారు. డాక్టర్లు మంచిగా ఉంటేనే అందరూ మంచిగా ఉంటారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: