బాలకృష్ణ కథల విషయంలో ఎంత జాగ్రతాగా ఉంటాడో తాను వేసే పాత్రయొక్క ఆహార్యం మీద కూడా అంతే జాగ్రతాగా ఉంటాడు. అంతేకాదు తన హెయిర్ స్టైల్ పై కూడా ప్రత్యేక శ్రద్ధను చూపిస్తాడు బాలయ్య. గత కొద్దిరోజులుగా బాలయ్య విగ్గు పై అనేకానేక కామెంట్స్ కూడా వచ్చాయి. ప్రత్యేకంగా రూలర్ సినిమా సమయంలో అయన హెయిర్ స్టైల్ గురించి విమర్శించని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా బాలయ్య 60 పుట్టిన రోజు సందర్భంగా BB3 ఫస్ట్ రోర్ ని రిలీజ్ చేశారు.

 


ఆ ట్రైలర్ చుసిన వారికీ మళ్లీ బాలయ్య కొత్తరకం విగ్గు తో కనిపించాడు అని అనుకున్నారు అంతా. అయినా కూడా ఆ హెయిర్ స్టైల్ బాగుందంటూ కామెంట్ కూడా చేశారు అభిమానులు. అయితే అసలు విషయం ఏమిటంటే  బాలయ్య హెయిర్  స్టైల్ విగ్గు కాదు అది  నిజంగా నిజమైన  బాలయ్య హెయిర్, బోయపాటి మరియు బాలయ్య కాంబినేషలో వస్తున్నా BB3 కోసం బాలయ్య రియాలిటిక్ గా కనిపించడానికి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడ‌ట‌. ఇకపై బాలయ్య హెయిర్ స్టైల్ పై సిల్లీగా కామెంట్స్ చేసేవారికి గట్టిగానే కౌంటర్ ఇవ్వనున్నాడు బాలయ్య .  

మరింత సమాచారం తెలుసుకోండి: