భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులను కట్టడి చేయడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు అనే చెప్పాలి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో చాలా మంది ఇప్పుడు సామాజిక వ్యాప్తి ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. 

 

దీని మీద ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీని విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. తాజాగా దీనిపై ఐసిఎంఆర్ స్పందించింది. భారతదేశం అంత పెద్ద దేశమని మరియు మరియు జనాభా కూడా ఎక్కువగా ఉందని... మన దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ఐసిఎంఆర్ డీజీ ప్రొఫెసర్ (డాక్టర్) బలరామ్ భార్గవ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: