దాదాపు మూడు నెలల తర్వాత తిరుమలలో భక్తులకు దర్శనం దొరికింది అని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏడు కొండల వాడి దర్శనం  నేటి నుంచి భక్తులకు అందుతుంది. తిరుమల విషయంలో ఇన్ని రోజులు ఆచితూచి వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ అనుమతులు ఇచ్చింది. 

 

ఇక ఇదిలా ఉంటే  తిరుమలలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై ఇప్పుడు సంతృప్తి వ్యక్తమవుతుంది. శ్రీవారి దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేసారు అని టీటీడీ అధికారులు మీడియాకు తెలిపారు. గురువారం రోజు శ్రీవారిని 8 రాష్ట్రాల భ‌క్తులు దర్శించుకున్నారని, తెలంగాణ 143, త‌మిళ‌నాడు 141, క‌ర్ణాట‌క 151 మంది భక్తులు వచ్చారు అని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కూడా వచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి: