కరోనా కేసులు దేశ రాజధాని ఢిల్లీ ని తీవ్రంగా భయపెడుతున్నాయి. అక్కడ కరోనా కేసులు ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా సరే ఫలితం ఉండటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అక్కడి వైద్య ఆరోగ్య శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫంక్షన్ హాళ్లు, స్టేడియాలు, మతసంస్థల భవనాలను కొవిడ్ ఆసుపత్రులుగా మార్చాలని ఢిల్లీ ఆరోగ్యశాఖ ఆదేశాలు ఇచ్చింది. 

 

ఆస్పత్రుల్లో పడకలు లేఖ ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ. నగరంలోని 50 ఫంక్షన్ హాళ్లు, 11 జిల్లాల్లోని స్టేడియాలు, మత సంస్థల భవనాలను కరోనా ఆస్పత్రులు గా మారుస్తూ వేగంగా పడకలను సిద్దం చెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చారు. మొత్తం దాదాపు 20 వేల వరకు పడకలను సిద్దం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: