తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి కరోనా కేసు నమోదు అయినట్టు అధికారులు పేర్కొన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కి కరోనా సోకింది అని అధికారులు వివరించారు. ఆయన గోవింద రాజ స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆయనతో సంబంధం ఉన్న మరో పది మందిని కూడా తాము క్వారంటైన్ చేసామని అధికారులు వివరించారు. 

 

కాగా తిరుమలలో జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులను అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.  నిన్నటి నుంచి ఇతర రాష్ట్రాల భక్తులు కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇక పరిస్థితితి ఆధారంగా భక్తుల సంఖ్యను పెంచే అవకాశం ఉంది అని సమాచారం. టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సహా పలు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా నిన్న భక్తులు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: