టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై బిజెపి నేతలు స్పందించారు. ఆయన అరెస్ట్ ని సమర్ధించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఎవరు అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకోవాల్సిందేనని కన్నా ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

గత టీడీపీ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందే వైఎస్‌ జగన్‌ చెప్పారని కన్నా ఈ సందర్భంగా గుర్తు చేసారు. అదే విధంగా ఏడాది కాలంగా అవినీతికి పాల్పడిన నేతల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి అన్నారు కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: