లాక్ డౌన్ లో ఇప్పుడు భారీగా వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన సంగతి తెలిసిందే. వారిని తీసుకుని వెళ్ళడానికి గానూ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు  శ్రామిక్ పేరుతో ప్రత్యేక రైలు సర్వీసులను నడిపిస్తుంది. ఇక వీటికి క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. వలస కార్మికులు కూడా వీటి కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. 

 

వలస కార్మికుల కోసం మరికొన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని 7 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేరళ, తమిళనాడు, కాశ్మీర్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు మరో 63 ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖలు రాసాయి. వలస కార్మికులతో ఇబ్బంది గా ఉంది అని దయచేసి దృష్టి పెట్టాలి అని కోరుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: