భారతదేశంలో మొదట్లో ఎంతో కంట్రోల్ లో ఉన్న కరోనా  వైరస్ కేసులు ప్రస్తుతం భారీ రేంజ్లో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక లక్ష కోట్లు దాటి పోయాయి అని అనుకునే లోపే రెండు లక్షలకు చేరువైంది కరోనా  కేసుల సంఖ్య, ఇప్పుడు రెండు లక్షల కేసులు అని భయ పడుతున్న తరుణంలో ఏకంగా మూడు లక్షల మైలురాయిని దాటింది. శనివారం ఉదయం నాటికి కరోనా  వైరస్ కేసుల సంఖ్య ఏకంగా మూడు లక్షలకు దాటింది. ఇక ఈ లక్షల కేసులకు  చేరుకోవడానికి భారత్ కేవలం 134 రోజుల సమయం మాత్రమే పెట్టడం గమనార్హం. 

 

 ఇక ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య 3,08,993 కి చేరింది... మృతుల సంఖ్య 8884 కాగా 1,54,330 మంది ఈ మహమ్మారి వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో మహమ్మారి వైరస్ వ్యాప్తి కి పట్టిన సమయం చాలా ఎక్కువ గా తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. ఇక మొదటి మూడు స్థానాల్లో ఉన్న అమెరికా బ్రెజిల్ రష్యా దేశాలలో మూడు లక్షల కరోనా  వైరస్ కేసులు వెలుగులోకి రావడానికి కేవలం అమెరికాలో 73, బ్రెజిల్ 85, రష్యా 109 రోజుల్లో 3 లక్షల కరోనా  వైరస్ కేసులను దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: