ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసులు దృశ్య మళ్లీ సంపూర్ణ లాక్ డౌన్  విధించే అవకాశాలు ఉన్నాయి అనే వాదన ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కూడా సంపూర్ణ లాక్ డౌట్  దిశగా కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశా సర్కార్ మరో సారి సంపూర్ణ లాక్ డౌన్  విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

 ఈరోజు నుంచి జూన్ 30వ తేదీ వరకు ఒడిశాలోని తొమ్మిది ముఖ్యమైన జిల్లాలలో సంపూర్ణ లాక్ డౌన్  విధిస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దయచేసి ప్రజలందరూ తమకు సహకరించాలని అంటు  ఒడిశా సర్కార్ కోరింది . కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఆయా జిల్లాలో అందుబాటులో ఉంటాయని.. అది కూడా కేవలం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి అని చెప్పుకొచ్చింది కాగా ఒడిస్సా బాటలోనే మరిన్ని రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: