ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రేపు ఎల్లుండు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటుగా ఏపీలోని పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖా పేర్కొంది. 

 

ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర గోవా సహా కర్ణాటక లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అని పిడుగులు కూడా పడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దీనిపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి అని వాతావరణ శాఖా పేర్కొంది. కాగా నైరుతి రుతు పవనాలు చాలా వేగంగా కదులుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: