ప్రస్తుతం గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్ లో ప్రధానంగా ఉన్న కంపెనీలు కేవలం 5 మాత్రమే. అవి శాంసంగ్,  ఆపిల్, మరియు హువావే ఒప్పో,  వివో. ఇక కొత్త నివేదిక ప్రకారం ఈ గ్లోబల్ లీడ్ సంస్థలకు అసెంబ్లీ ప్లాట్ఫారం అందించడం ద్వారా... గ్లోబల్ వాల్యూ చైన్ లో భారత దేశం కూడా ఒక భాగం అయ్యే సమయం వచ్చేసింది. దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ మొబైల్ ఫోన్  మార్కెట్ లో ఐదు కంపెనీల నుంచి విడుదలైన మొబైల్స్ కి మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.

 

 అయితే ఈ ఐదు కంపెనీల నుంచి ఇప్పటికే పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది భారత్. ఇక ప్రపంచ మార్కెట్లకు చేరువ అయ్యేందుకు దేశానికి ఎక్కువ తయారీ తీసుకురాగలదని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ నివేదికలో తెలిపింది. దీంతో త్వరలో భారత్ కూడా గ్లోబల్ మొబైల్ సంస్థలకు ప్లాట్ఫారం అందించి గ్లోబల్ వాల్యూ చైన్ లో  భాగం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: