ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా  వైరస్ కు విజృంభిస్తున్న  విషయం తెలిసిందే. ఇక ఈ రోజు ఏకంగా 40 వేల కేసుల మార్కు కూడా దాటేసింది దేశ రాజధాని ఢిల్లీ. ప్రతి రోజు అక్కడ 1600 పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ప్రయోగశాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ప్రయోగశాలలు వారి పూర్తి సామర్థ్యంతో పని చేయాలని... ఎక్కువ మొత్తంలో కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది కేజ్రీవాల్ సర్కార్. అన్ని  ప్రయోగశాలలు తమ పరీక్ష సామర్థ్యాన్ని పెంచాలి అంటు కోరింది . ప్రభుత్వ ఆర్డర్  ప్రకారం 48 గంటల్లో ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: