ఆడుకుంటూ కారులోకి వెళ్ళిన ఇద్దరు చిన్నారుల ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే మొరాదాబాద్ లో నలుగురు చిన్నారులు ఆడుకుంటూ కారులోకి వెళ్ళారు. అయితే ఆ సమయంలో కారు డోర్ లాక్ పడిపోయింది. దీనితో ఎలా బయటకు రావాలో ఆ చిన్నారులకు అర్ధం కాలేదు. 

 

గట్టిగా అరిచినా సరే బయటకు వినపడటం లేదు. ఆ చుట్టూ ఉన్న జనాలకు కూడా అరుపులు వినపడే అవకాశం లేదు. దీనితో ఇద్దరు చిన్నారులు కారులోనే ప్రాణాలు కోల్పోగా అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి ఇద్దరినీ బయటకు తీయగా వారికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: