ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలయింది. ఇక గవర్నర్ ప్రసంగం చర్చ ఆమోదం అన్నీ నేడే జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్ ప్రసంగిస్తున్నారు. దేశంలో తొలిసారి గా ఈ తరహా ప్రసంగం జరుగుతుంది. 

 

కరోనా కారణంగా గవర్నర్ ఆన్లైన్ లోనే ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా మొత్తం 8 బిల్లులను ప్రవేశ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా బడ్జెట్ ని మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెడతారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బిఎసి సమావేశం జరుగుతుంది. దీనిలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: