కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని అన్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చంద్. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణా చర్యలను వివరించారు. ప్రతీ రోజు కూడా కరోనా పరీక్షలను అన్ని రాష్ట్రాల కంటే చాలా వేగంగా చేస్తున్నామని అన్నారు. 

 

ప్రతీ రోజు 15 వేలకు పైగా కరోనా పరిక్షలు చేస్తున్నట్టు  గవర్నర్  వివరించారు. ఇతర రాష్ట్రాల కంటే ముందు ఉన్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు రాష్ట్ర వ్యాప్తంగా 65 కోవిడ్ ఆస్పత్రిలు ఏర్పాటు చేసామని అన్నారు. రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసినట్టు ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: