జనతా బజార్ల ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు మంత్రి కన్నబాబు. వ్యవసాయ బడ్జెట్ ని ఆయన ప్రవేశ పెట్టారు. 29 వేల 159.97 లక్షలతో ఆయన బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 

 

ప్రతీ గ్రామంలో పట్టణం లో కూడా జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాణ్యమైన విత్తనాలను అందిస్తామని చెప్పుకొచ్చారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అందిస్తామని అన్నారు ఆయన. రైతులు ఎవరూ కూడా అప్పుల పాలు కావొద్దు అనేది తమ ప్రధాన ఉద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: