తెలంగాణకు మిడతల ముప్పు పొంచి ఉన్న నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర సిఎస్ సోమేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడత లు దాడి చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆయన. మిడతల ప్రభావం ఉన్న 9 జిల్లాల కలెక్టర్ లు ఎస్పీలు, ఫైర్‌, వ్యవసాయ, అటవీశాఖ అధికారులులతో ఆయన సమావేశం అయ్యారు. 

 

సరిహద్దు జిల్లాల్లో మిడతలు దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికను తయారు చెయ్యాలి అని సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులు, పరికరాలు, మెటీరియల్‌కు సంబంధించి ఇన్‌వెంటరీని తయారు చేయాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: