సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని ఘటనలు చూస్తే అసలు జనాలు ఏ విధంగా ఉన్నారు అనేది కాస్త భయంకరంగా ఉంటుంది ఆలోచించడానికి. తాజాగా జరుగుతున్న కొన్ని అత్యాచారాలు అయితే ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా కన్న కూతురు పై ఒక ప్రబుద్దుడు అత్యాచారం చేసాడు. 

 

హైదరాబాద్ లోని సూరారంలో నివాసముండే ఓ పెయింటర్‌ తన కుమార్తె పై రేప్ చేసాడు. 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో ఆ బాలిక గర్భం కూడా దాల్చింది. ఇప్పుడు ఆమె ఆరు నెలల గర్భంతో ఉంది. తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆగ్రహించిన స్థానికులు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: