ప్రస్తుతం కరోనా  వైరస్ దృష్ట్యా ఎలాంటి ఉత్సవాలు ఊరేగింపులు జరగడం లేదు. కరోనా కారణంగా దేవుడు కూడా సైలెంట్ గానే ఉండిపోవలసి వస్తుంది. అయితే ఒడిశా లో జరిగే పూరీ జగన్నాథ్ రథ యాత్రకు భక్తులు ఏ సంఖ్యలో హాజరవుతారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇసుక వేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. 

 

 అయితే ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న ఒడిస్సా పూరి జగన్నాథుని రథయాత్ర వేడుకలను రద్దు చేసుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పది నుంచి పన్నెండు రోజుల వరకు జరిగే ఈ రథయాత్ర కోసం విదేశాల నుంచి దాదాపు పది లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య ఈ వేడుకలను నిర్వహించక పోవడం మంచిది అంటూ ఆదేశించింది. రథ యాత్రకు అనుమతి ఇస్తే పూరి జగన్నాథుడు  తమను క్షమించడు అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: