కొన్ని రోజులు రాజకీయాలు పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆయన దాదాపు మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఈ మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు వాయిదా పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆయన 28 వ సినిమా గురించి ఒక ప్రకటన వచ్చింది. 

 

వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి గానూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 2022 వేసవిలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అని సమాచార౦. పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రిష్ తో పాటుగా వకీల్ సాబ్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: