భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఇప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక తాజాగా అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. నిన్న ప్రధాని ఆల్ పార్టీ మీటింగ్ కి ఆహ్వానించారు. 

 

రేపు సాయంత్రం 4 గంటలకు ఈ అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం వైఎస్ జగన్ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారు సిఎం జగన్. ఈ నేపధ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ సిఎం జగన్ కి ఫోన్ చేసారు. అఖిలపక్ష సమావేశం ప్రాధాన్యతను సిఎం కు వివరించారు. దీనిలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: