సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా వస్తువులను మన దేశంలో బహిష్కరించాలి అనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. తాజాగా హైదరాబాద్ లో వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన మార్కెట్ లు గా చెప్పే బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానా హోల్‌సేల్ వ్యాపారస్తులు అందరూ చైనా ఉత్పత్తులను ఏమాత్రం విక్రయించరాదని నిర్ణయం తీసుకోవడం విశేషం. 

 

గాల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా చేసిన దాడి నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక దేశ వ్యాప్తంగా కూడా చైనా వస్తువులపై నిషేధం విధించాలి అని డిమాండ్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: