గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హర్యానా లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది, హర్యానాలోని రోహ్‌తక్‌కు తూర్పు-ఆగ్నేయంలో 15 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు 05:37:40 గంటలకు సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 

 

ఈ భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా సరే ప్రజలు మాత్రం భయపడ్డారు. ఇక ఢిల్లీ లో కూడా తరుచుగా భూకంపాలు ప్రజలను బాగా భయపెడుతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. రోజు రోజుకి  అవి పెరుగుతున్నాయి. దీనితో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: