లాక్ డౌన్ లో కొందరు చేతి వృత్తుల వారు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. బయట మార్కెట్ కూడా లేకపోవడంతో ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు అందకారంగా మారింది. ఈ నేపధ్యంలో వారిని ఆదుకోవాలి అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిఎం వైఎస్ జగన్ కి లేఖ రాసారు. లాక్‌డౌన్‌ కారణంగా చేతివృత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

 

మత్స్యకారులు, చేనేత కార్మికులు, నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మాత్రమే ప్రభుత్వం కొద్దిపాటి సాయం చేసిందని ఆయన ఆరోపించారు. మిగిలిన వృత్తిదారులకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. చేతి వృత్తిదారులకు 6నెలల పాటు నెలకు రూ.10 వేల సాయం, 50 కేజీల బియ్యం, 50 కేజీల గోధుమలు ఉచితంగా ఇవ్వాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: