భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చైనా ఆర్మీ భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం, అలాగే దాడులు చేయడంతో భారత ఆర్మీకి చెందిన 24 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనిపై దేశ వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తమవుతుంది. 

 

తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోని ఇండియా- టిబెట్ సరిహద్దు సమీపంలోని నీతి గ్రామంలో చైనాపై స్థానికులు  ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన  తెలిపారు. ఒక గ్రామస్తుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ "గాల్వన్ వ్యాలీలో మా సైనికుల ప్రాణాలు కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఏ పరిస్థితిలోనైనా భారత సైన్యానికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: