కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. పార్లమెంటు భవనం నిర్మాణం చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను అడ్డుకొలెమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. చట్ట ప్రకారం పనులు చేస్తున్న వారిని నిలువరించ లేము అంటూ చెప్పుకొచ్చింది.అయితే  20 వేల కోట్ల ప్రాజెక్టుకి అక్రమ అనుమతులు ఇచ్చినట్లు రాజీవ్  సూర్య అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయగా దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత ధర్మాసనం విచారించింది. 

 

 ప్రభుత్వం యథేచ్ఛగా అనుమతులు ఇస్తుంది అంటూ  పిటిషనర్ వాదించగా చట్టప్రకారం చేసే అధికారులను  అడ్డుకోగలమా  అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. అదే సమయంలో ప్రాజెక్టు క్లియరెన్స్ విషయంలో ఎటువంటి ఉల్లంఘన  జరగలేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదించారు. దీంతో సుప్రీంకోర్టు నుంచి కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: