తెలంగాణాలో ఇప్పుడు అడవి జంతువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో గాని మహారాష్ట్రతో సరిహద్దుని పంచుకున్న జిల్లాలు మాత్రం భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు. 

 

ఇక ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లాలోనే శ్రీరాంపూర్, జైపూర్ అటవీ ప్రాంతంలో ఇటీవల సింగరేణి ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి ప్రస్తుతం చెన్నూరు డివిజన్ అటవీ ప్రాంతానికి చేరిందని అధికారులు గుర్తించారు. భీమారం, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పెద్దపులి సంచరిస్తోందని గుర్తించారు. సోమరపల్లి, పారపల్లి, తంగిడి సోమారం, నర్సింగ పూర్ గ్రామాల్లో పులి అడుగులను అక్కడి స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. నాలుగు మండలాల పరిధిలో రెండు పెద్ద పులులు తిరుగుతున్నాయి అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: