ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. తొలి విజయం  వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి సాధించారు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు ఫలితాలు వచ్చాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణ ఫలితం రెండో సారి రాగా మూడో ఫలితం పరిమల్ నత్వానిది వచ్చింది. ఆ తర్వాత మరో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ది వచ్చింది. 

 

దీనితో మంత్రులు ఇద్దరూ  నేడు లేదా రేపు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య ఓడిపోయారు. ఇక  నాలుగు చెల్లని ఓట్లు టీడీపీకి పడ్డాయి అని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.  దీనితో వైసీపీ బలం రాజ్యసభలో ఆరుకి పెరిగింది. దీనిపై సిఎం జగన్ హర్షం వ్యక్తం చేసారు. గెలిచిన ఒక్కో అభ్యర్ధికి 38 ఓట్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: