టాలీవుడ్ తో పాటుగా తమిళ సినీ పరిశ్రమలో కూడా ఇప్పుడు సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చినా సరే అగ్ర తారలు మాత్రం షూటింగ్ లో పాల్గొనే విషయంలో ఆలోచనలో పడ్డారు. దీనిపై తమిళ సినీ జర్నలిస్ట్ ఒకరు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది అసలు పెద్ద స్టార్ లు సినిమాల షూటింగ్ కి వచ్చే అవకాశం లేదని కామెంట్ చేసారు. 

 

ఫిల్మ్ షూట్స్ నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, పెద్ద తారలు నిర్మాతలకు స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు. వారు వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరి నాటికి మాత్రమే సెట్లలో చేరతారని అంటూ ట్వీట్ చేసారు. తమిళ సినిమాలో, పెండింగ్‌లో ఉన్న సినిమాలు మాత్రమే తిరిగి ప్రారంభించబడతాయని... వచ్చే ఏడాది మాత్రమే కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: