గత పది రోజులుగా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడో ఒక చోట కాల్పులకు దిగుతూనే ఉంది. సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు దిగింది. జమ్మూ కాశ్మీర్ కృష్ణ ఘాటి, నౌషెరా రంగాల్లో ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించింది.

 

 ఉదయం 5:30 గంటలకు నౌషెరా సెక్టార్లో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. భారత సైన్యం కూడా అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒక పక్క ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపుతున్నా సరే పాకిస్తాన్ మాత్రం ఆగడం లేదు. ఉగ్రవాదులకు డ్రోన్ ల ద్వారా ఆయుధాలను ఇచ్చే కార్యక్రమాలను పాకిస్తాన్ చేస్తుంది. తాజాగా ఒక డ్రోన్ ని అధికారులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: