ఈనెల 23 న జరగాల్సిన చారిత్రాత్మకమైన పూరి జగన్నాథ్ రథయాత్ర పై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పూరి జగన్నాథ్ రథయాత్ర రద్దు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 

 

 ఈ నేపథ్యంలో ఎంతో మంది భక్తులు నిరాశతో ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు లేకుండా పూరి రథయాత్ర నిర్వహించేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. దీంతో ఈనెల 23 న జరగాల్సిన జగన్నాథుని రథయాత్ర చక్రాలు కదలనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. 12పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. జనం లేకుండా రథయాత్ర నిర్వహించేందుకు అనుమతించాలంటూ కేంద్రం కోరింది

మరింత సమాచారం తెలుసుకోండి: