హరిత హారం విషయంలో తెలంగాణా సర్కార్ ఏ స్థాయిలో దూకుడుగా ఉందో తెలిసిందే. ఇక తాజాగా హరిత హారం కార్యక్రమం ఆరో విడత మొదలు పెట్టింది తెలంగాణా సర్కార్. దీనిపై రాష్ట్ర మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఏడాది భారీ ఎత్తున హ‌రిత‌హారం నిర్వహిస్తామని అన్నారు ఆయన. 

 

మొక్కలు నాట‌డం, కాపాడ‌టం అంద‌రి సామాజిక బాధ్యత అన్నారు ఆయన. హైదరాబాద్ లో న‌గ‌రంలో ప్రతి పౌరుడు చెట్లు నాటాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆహ్లాద‌ప‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాలని వ్యాఖ్యానించారు. హ‌రిత‌హారంలో న‌గ‌రంలోని అన్ని పార్టీల ప్ర‌జాప్రతినిధులు మొక్క‌లు నాటాలని ఈ సందర్భంగా సూచించారు. పార్కులు, ఖాళీ స్థ‌లాలు, అపార్ట్ మెంట్స్ అన్ని స్థ‌లాల్లో హరితహారం చేప‌ట్టాలన్నారు. మొక్క‌లను జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో అంద‌రికి అందిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: