దేశంలో వరుసగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరగడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెట్రోల్ ధరలను ఈ స్థాయిలో పెంచడం తో సామాన్యులపై భారం ఎక్కువగా పడుతుంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఇటీవల కేంద్రం 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దీనిపై కూడా కొందరు సెటైర్ లు వేస్తున్నారు. 

 

అసలు 20 లక్షల కోట్లను ఇచ్చారా వసూలు చేస్తున్నారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 20  లక్షల కోట్లను ఇచ్చినట్టు లేదు వసూలు చేస్తున్నట్టు ఉంది అంటూ పలువురు కేంద్రంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యులు ఏ విధంగా భరిస్తారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: