నేపాలో లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడి సర్కార్ చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. ఇక నేపాల్ లో కరోనా కేసులు 10 వేలు దాటాయి. అక్కడ గత 24 గంటల్లో 500 పైగా కేసులు నమోదు అయ్యాయి. ఆ దేశ జనాభా ప్రకారం చూస్తే ఈ కేసులు భారీగా నమోదు అయినట్టే. 

 

ఆరోగ్య పరంగా చూస్తే ఆ దేశంలో సౌకర్యాలు చాలా తక్కువ. ఆ దేశ బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు నిధులు అంతగా కేటాయించే పరిస్థితి లేదు. పర్యాటక రంగం మీద ఆధారపడే ఆ దేశానికి ఇప్పుడు కరోనా పెద్ద తల నొప్పిగా మారింది. ఈ తరుణంలో నేపాల్ భారత్ తో కయ్యం పెట్టుకోవడంతో నేపాల్ కి సహాయం అందే పరిస్థితి కూడా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: