ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఇళ్ళ పట్టాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అన్నారు. మనకి ఓటు వేయని వారికి కూడా ఇళ్ళ  పట్టాలు అందించాలి అని ఆయన సూచించారు. జులై 8 న ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 

 

భూసేకరణ ప్లాట్ల అభివృద్ధి పై పర్యవేక్షణ చెయ్యాలి అని అన్నారు. నూటికి నూరు శాతం అందరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అన్నారు. కరోనా తగ్గిన తర్వాత గ్రామాల్లో పర్యటన వెంటనే పర్యటిస్తా అని అన్నారు. లబ్ది దారుల జాబితా వెంటనే గ్రామ సచివాలయాల్లో ఉండాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎవరికి ఇళ్ళ పట్టా అందకపోయినా సరే అధికారులదే బాధ్యత అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: