కృష్ణా జిల్లాలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. దీనితో ప్రజలు బయటకు రావాలి అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. గళవారం కొత్తగా మరో 33 మందికి కరోనా వైరస్‌ సోకడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1300 పైగానే ఉంది. ఇక జిల్లాలో మరణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్క రోజే ఏకంగా ముగ్గురు మరణించారు. 

 

ఇక అధికారికంగా జిల్లాలో 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక వీరిలో ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. ఆ సంఖ్యా తీసేస్తే 1100 వరకు కరోనా కేసులు ఉన్నాయి జిల్లాలో. గత పది రోజుల్లోనే దాదాపు మూడు వంతుల కరోనా కేసులు జిల్లాలో నమోదు అయ్యాయి. మార్చ్ నుంచి నమోదు అయిన కేసులు ఒక లెక్క పది రోజుల్లో నమోదు అయిన కేసులు ఒక లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: