దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు కూడా అదే స్థాయిలో పెట్రోల్ తో పోటీ పడుతున్నాయి. అయితే ఇక్కడ అనూహ్య విషయం ఏంటీ అంటే... పెట్రోల్ ధరల కంటే గతంలో డీజిల్ ధర చాలా తక్కువ ఉండేది. కనీసం 5 రూపాయలు అయినా సరే తక్కువ ఉండేది. కాని ఇప్పుడు అనూహ్యంగా పెట్రోల్ ధరలను డీజిల్ మించి పోయింది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో లీటరుకు డీజిల్ ధర పెట్రోల్‌ను మించిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ .79.76 (పెరుగుదల లేదు) మరియు రూ .79.88 కి చేరుకుంది. 48 పైసలు పెరిగింది. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఏ దేశంలో కూడా ఈ తరహా విధానం ఉండదు అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: