కరోనా  సంక్షోభం సమయంలో పీపీఈ కిట్లు,  ఫేస్ మాస్కులు ఎగుమతిపై కేంద్రం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రం,  డిల్లీ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది.. విదేశీ వ్యవహారాలు,  వాణిజ్య మంత్రిత్వ శాఖ,  డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్యారిస్ ట్రేడ్ ,ఢిల్లీ ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. 

 

 అయితే కరోనా  మహమ్మారి నేపథ్యంలో దేశంలో ఉన్న కొరతను నివారించేందుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున వాదనలు వినిపించారు, అదే సమయంలో దేశంలో కొన్నికొనుగోలు దారుల కొరత  లేదని అయితే పిటిషనర్ తో పాటు తయారీదారులు లాభాలు ఆర్జించేందుకు ఎగుమతి చేయాలనుకుంటున్నారు అంటూ వాదించారు. కాదు హైకోర్టు జూలై 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: