ప్రైవేటు ఆస్ప‌త్రులు రోగుల‌ను చేర్చుకునేందుకు నిరాకరిస్తున్న నేపధ్యంలో  ప‌శ్చిమ బెంగాల్ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగుల‌ను చేర్చుకోక‌పోతే.. అలాంటి ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది. ఒక వేళ ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు రోగుల‌ను చేర్చుకునేందుకు నిరాక‌రిస్తే మాత్రం లైసెన్సులు ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చరించింది. 

 

ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు చాలా సంద‌ర్భాల్లో రోగుల‌ను చేర్చుకోలేదని.. వారి వైఖ‌రి కార‌ణంగా రోగులు చాలా బాధ‌లు ఎదుర్కొవాల్సి వ‌చ్చింద‌ని మండిపడింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఎమ‌ర్జెన్సీ రోగుల‌ను చేర్చుకోక‌పోతే మాత్రం వారిపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది. ఈ ఉత్త‌ర్వుల‌ను అన్ని ఆస్ప‌త్రుల మెడిక‌ల్ సూప‌రింటెండెంట్లు అమ‌లు చేయాల‌ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: