మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కేసులు అక్కడ ప్రజలను భయపెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ కొన్ని జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఒక పులి అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపధ్యంలో దానికి కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

 

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని ఒక జంతుప్రదర్శనశాలలో ఈ రోజు ఒక పులి మరణించిందని అధికారులు పేర్కొన్నారు. జూన్ 21 నుండి ఆ పులి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోందని అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుందని వివరించారు. ఐసిఎంఆర్ ఆమోదం పొందిన తరువాత దానికి కరోనా పరిక్షలు నిర్వహిస్తామని మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ నీతా పడల్కర్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: