మెక్సికో దేశంలోని ఒక్సాకా నగరంలో సంభవించిన భూకంపం తీవ్రతకు ఏడుగురు మరణించారు అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మెక్సికో నగరానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక్సాకా నగరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రతకు 23 మంది తీవ్రంగా గాయాలపాలు అయ్యారు అని అక్కడి అధికారులు ఒక మీడియా ప్రకటనలో తెలిపారు. 

 

ఈ తీవ్రత ధాటికి ఒక్సాకా నగర పరిధి సాలీనాక్రూజ్‌లోని ఆయిల్ రిఫైనరీని మూసి వేసినట్టు వెల్లడించారు. భూకంపం తీవ్రత కారణంగా ఆయిల్ రిఫైనరీలో భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మళ్ళీ భూకంపం భయంతో ఇళ్ళకు రావడం లేదు ప్రజలు. దాదాపు 2 వేల ఇల్లు నాశనం అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: