దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 5 లక్షల దిశగా వెళ్తున్నాయి. మరణాలు కూడా 15 వేలు దాటాయి. ఇక ప్రతీ రోజు కూడా 15 వేలకు పైగా కేసులు దాదాపుగా 400 పైగా మరణాలు దేశంలో నమోదు అవుతున్నాయి. యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే దేశంలో ప్రతీ రోజు కూడా మూడు లక్షల పరిక్షల దిశగా వైద్యులు అడుగులు వేస్తున్నారు. 

 

జూన్ 25 వరకు మొత్తం 77, 76, 228 పరీక్షలను చేసామని ఐసిఏమార్ ప్రకటించింది. జూన్ 25 న పరీక్షించిన నమూనాల సంఖ్య 2,15,446 అని పేర్కొంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా పరీక్షలను ఎక్కువగా చేస్తున్నారు. అక్కడే ఎక్కువగా కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: