గత  20 రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ఒక్క రోజు అనుకుంట పెట్రోల్ ధర మాత్రం పెరగలేదు. ఇక ప్రతీ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారం నుంచి కూడా ఈ విధంగా పెట్రోల్ ధరలు పెరగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కేంద్రం చర్యలు తీసుకోవాలని  పలువురు మండిపడుతున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే గత పది రోజుల్లో పెట్రోల్ ధర 8 రూపాయల 93 పైసలు పెరిగింది. డీజిల్ ధర 10 రూపాయల 7 పైసలు పెరిగింది. దీనితో ఇప్పుడు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రయాణాలు ఏ విధంగా జరపాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: