సిరిసిల్ల నియోజకవర్గంలో ఆరో విడత హరిత హారం కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవునూరు లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... భావి తరాల కోసమే హరిత హారం కార్యక్రమం అని అన్నారు. సిఎం కేసీఆర్ సంకల్పం నెరవేర్చాలి అని ఆయన అన్నారు. 

 

ప్రతీ ఒక్కరు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటాలి అని ఆయన పిలుపునిచ్చారు. రైతును రాజుని చెయ్యాలి అని వ్యవసాయాన్ని పండగ చెయ్యాలి అని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కేటిఆర్ అన్నారు. 54 లక్షల మంది రైతులకు తెలంగాణా సర్కార్ 7 వేల కోట్లకు పైగా రైతు బంధు అందించారు అని ఆయన అన్నారు. రైతులకు ప్రతీ నిమిషం అండగా ఉంటామని చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: