పెళ్లి...  ఈ పదం ఇంకొన్నాళ్ళు మనం వినే అవకాశం లేదనే అంటున్నాయి పరిస్థితులు. ఈ కరోనా దెబ్బకు పెళ్లి పీటలు ఎక్కే పరిస్థితి దాదాపుగా లేదు. సామాన్యులకే కాదు ప్రధానులకు కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా డెన్మార్క్ ప్రధాని పెళ్లి మూడో సారి కరోనా కారణంగా వాయిదా పడింది. 

 

డెన్మార్క్ ప్రధాని మెట్టె ప్రెడ్రిక్‌సన్ కరోనా దెబ్బకు మూడోసారి తన వివాహం వాయిదా వేసుకున్నారు. ఈ విషయం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తనకు కాబోయే భర్తతో ఆమె ఫోటో ని పోస్ట్ చేసారు. ఇతన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నా అంటూ ఆమె పేర్కొన్నారు. కాని అది  ఇప్పట్లో జరిగే అవకాశం కనపడట౦ లేదని ఆమె అన్నారు. మరి ఎప్పుడు చేసుకుంటారో... జులైలో చేసుకోవాలని అనుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: