దేశ రాజధాని ఢిల్లీలోకి మిడతల దండు ప్రవేశించింది. దీనితో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీనిపై ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. మిడుతలు ఒక చిన్న సమూహం ఢిల్లీ సరిహద్దులోకి ప్రవేశించిందని అన్నారు. దక్షిణ, పశ్చిమ జిల్లాలను హై అలర్ట్ చేశామని ఆయన వివరించారు. 

 

మిడుతలను నియంత్రించాలని తాము అన్ని జిల్లాల అధికారులకు సలహా ఇచ్చామని గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక మిడతలను కట్టడి చేయడానికి గానూ ప్రత్యేక అధికారులను కూడా నియమించాలి అని భావిస్తుంది అక్కడి సర్కార్. అసలే కరోనాతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సర్కార్ పై మిడతల దాడి కలవరం రేపుతుంది. దీనిపై సిఎం కేజ్రివాల్  ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: